Sunday, May 12, 2013

బిపన్ చంద్ర చదివిన ప్రతీ సారీ మనసులో ఏదో ఉద్వేగం కలుగుతుంది.కళ్లు చెమరుస్తాయి.అది ఆనందానికో, ఆవేదనకో సంకేతాలు తెలియరావడం లేదు.దేశ వాతావరణం లో ఎంతో మార్పు వచ్చింది.నాటి యువకులు భగత్ సింఘ్, బిస్మిల్, సూర్య సేన్ వంటి వారు దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ద్ద పడితే, నేడు ఓటు వేయడానికి కూడా యువత కాలు గడప దాటడం లేదు.నాటి నాయకులు నెత్తుటి చమురు తో స్వతంత్ర్య జ్యోతిని వెలిగిస్తే, నేటి నేతలు ఆ జ్యోతిని రావణ కాష్టం గా ఉపయోగిస్తూ దేశాన్ని తగుల పెడుతున్నారు. పత్రికలలో వార్తల కోసం డబ్బులు ఇవ్వాలి అన్న బహిరంగ రహస్యం తెలిసిన మనకు, తిలక్, శిశిర్ కుమార్ ఘోష్, దాదాబాయి లు పత్రికలలో వార్తలను రాయడనికి, ఆ వార్తలను చేరవేయడానికి నానా తిప్పలు పడే వారు అన్న సత్యం జీర్ణించుకోవడం కొంచం కష్టం గానే ఉంటుంది. 

బుస్సుల్లో అత్యాచారం చేసేంతగా, రోడ్ల మీద పడి కొట్టుకునేంత స్వాతంత్ర్యం వచ్చినందుకు ఆనంద పడాలో, అంతర్జాలం లో జోక్ చేస్తే జైలు కి వెళ్ళాల్సినంత నియంత్రుత్వం ఉన్నందుకు ఏడవాలో తెలియని సందిగ్ధం లో ఉన్నము మనం.గాంధీ ని నమ్మిన చేనేత కార్మికుడి  లాగానే స్వరాజ్యం కడుపు ఎండి పోయి ఏదో మూలన ఏడుస్తూ ఉండవచ్చు.నిజానికి మనం భద్రపరచాల్సింది అంతరించి పోతున్న జీవ వైవిధ్యాన్ని కాదు, కాటికి కాలు చాపిన స్వరాజ్యాన్ని .

No comments: