Tuesday, April 23, 2013

on child rape in Delhi...



వసంతం భయపడింది...
విరిసి విరియని నవ్వులను సైతం చిదిమి వేసే
దారుణమైన కామాగ్ని ఈ లోకాన్ని చుట్టుముట్టిందని

వసంతం ప్రశ్నించింది...
పసి నవ్వులను కాపాడలేని మీకు
క్రొవ్విరుల తావిని ఆస్వాదించే అర్హత ఎక్కడిదని 

వసంతం వెళ్లిపోయింది ...
మళ్లీ విరియని మోడు మ్రాకులను,
మన పాపాలకు సాక్ష్యాలుగా మిగులుస్తూ.



No comments: