ఒక క్షణం పర్వత శ్రేణిని అధిరోహిస్తూ
మరు క్షణం అగధాల్లోకి పడిపోతూ
భవిష్యత్తు కై భావ సోపానాలు నిర్మిస్తూ
నిన్నటి జ్ఞాపకాలను నెమరువేస్తూ
వాక్వ్యయం చేస్తూ,కాలానికి కళ్లెం తీయడమేనా జీవితమంటే?
కోడి తోనూ, గుడ్ల గూబల తోనూ నిరంతరం పొటీ పడుతూ
అర్ధం లేని పరుగుతో ఎండ మావులను ఛేధిస్తూ
నిరంతరం బహిర్ముఖుడవై, ఇతరుల జీవితాలను జీవిస్తూ
నీ జీవితపు పరమార్ధన్నే మరచిపోయావా?
నీ మీద నీవే యుద్ధం ప్రకటించి, అజ్ఞానపు శృంఖలాలను తెంచి
అంతర్ముఖుడవై, నామ రూప గుణా ల తెరలను మసి చేసి
నిత్యం నిన్ను నువ్వు సంస్కరించుకుని
అనంతమైన మైత్రి ని హృది నిండా నింపినపుడే
నీ ఈ జన్మ సఫలం అని తెలుసుకో!