Wednesday, December 19, 2012



ఒక క్షణం పర్వత శ్రేణిని అధిరోహిస్తూ
మరు క్షణం అగధాల్లోకి పడిపోతూ
భవిష్యత్తు కై భావ సోపానాలు నిర్మిస్తూ
నిన్నటి జ్ఞాపకాలను నెమరువేస్తూ
వాక్వ్యయం చేస్తూ,కాలానికి కళ్లెం తీయడమేనా జీవితమంటే?

కోడి తోనూ, గుడ్ల గూబల తోనూ నిరంతరం పొటీ పడుతూ
అర్ధం లేని పరుగుతో ఎండ మావులను ఛేధిస్తూ
నిరంతరం బహిర్ముఖుడవై, ఇతరుల జీవితాలను జీవిస్తూ
నీ జీవితపు పరమార్ధన్నే మరచిపోయావా?

నీ మీద నీవే యుద్ధం ప్రకటించి, అజ్ఞానపు శృంఖలాలను తెంచి
అంతర్ముఖుడవై, నామ రూప గుణా ల తెరలను మసి చేసి
నిత్యం నిన్ను నువ్వు సంస్కరించుకుని
అనంతమైన మైత్రి ని హృది నిండా నింపినపుడే
నీ ఈ జన్మ సఫలం అని తెలుసుకో!

Monday, July 23, 2012

ముద్దు..

నా చెలి రాసిన ఉత్తరము నను చేరింది

అభివ్యక్త పరచలేని భావాలను అందులొ నింపింది

సూటిగా తను నా గుండె లోతుల్లోకి పంపింది

నా నవ నాడులను ఒక్కసారిగ ఉత్తేజపరచింది

ఇనుడు పంపిన లేఖ తో పుష్పము వికసించింది

ఆమె పంపిన ఉత్తరముతో నా పెదవి కందింది

Sunday, April 22, 2012

Prayer!

God give us men. The time demands
Strong minds, great hearts, true faith, and willing hands;
Men whom the lust of office does not kill;
Men whom the spoils of office cannot buy;
Men who possess opinions and a will;
Men who have honor; men who will not lie;
Men who can stand before a demagogue
And dam his treacherous flatteries without winking;
Tall men, sun-crowned, who live above the fog
In public duty and in private thinking.

Tuesday, March 20, 2012

naa anveshanam

ఉదయపు తొలి రవి కిరణం మబ్బుల తెరను తీసి తొంగి చూడటం తో మొదలు అవుతుంది
నా అన్వేషణ.నీ ఆచూకి కోసం వెదకని పత్రిక, చదవని పుస్తకం, తిరగని చోటు
లేదు.నిరంతరం నీ ధ్యాసే.కళ్లలో నిను చేరుతాను అనే స్వప్నం తో గుండెల్లో
నిను చూడగలను అనే ఆశ తో రోజంతా గడిపేస్తాను.

అసలు ఎపుడు మొదలు అయింది నే మీద ప్రేమ అంటే ఏమని చెప్పను? పసి పాప కనులు
తెరచి చూసిన క్షణం గురించి ఖచితంగ చెప్పగలిగిన ఆ తల్లిని, తన బిడ్డ అంటే
ఎపుడు ఇష్టం కలిగింది అంటే ఎం చెబుతుంది?ఎపుడు మొదలు అయినదొ తెలియదు కాని
ఇప్పుడు మాత్రం నన్ను నడిపిస్తోంది.నిను కలసిన క్షణం నీ తో చెప్పాల్సిన
ఊసుల గురించిన తలపులతో నే నా రాత్రులు కరిగిపొతున్నాయి.అలసిన కనులని మూసి
వేయగలను కాని మనసు తలుపులు మూయ లేకుండా ఉన్నాను.

ఎందుకో నీ పట్ల నాకు ఇంత పొస్సెస్సివెనెస్స్(possessiveness)?గాలి లో నీ
గురించిన మాటలు ఎక్కడ తేలియాడుతున్నాయా ఎపుడు వలవేసి పట్టుకుందామా అని నా
చెవులు నిరంతరం సిద్ధంగా ఉంటాయి.నిన్ను గురించి ఎవరైనా దుర్భాషలాడితే
అస్సలు సైపలేను.నీవు ఎవరినైనా కలిసావు అని తెలిస్తే అసూయ తో దహించుకు
పోతాను.ఒక్కోసారి నువు కూడా నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లు అనిపిస్తూ
ఉంటుంది.అల అనిపించిన క్షణం, ఆ క్షణం నా మనస్సు మహానంద గాలిలో వెర్రిగా
ఊగిపోతున్న డోలికే అవుతుంది.నాకు తెలుసు మనం కలిసి జీవించేది మురికి
వాడల్లో అని, అయినా ఆ పంకము కూడా పన్నీరు లాగా నే కనిపిస్తుంది నా
కనులకి.

నిను చేరడం ఆలస్యం అవుతుంది అంటేనే నా మది దుఃఖ సాగరంలో
కొట్టుకుపోతోంది.అలాంటిది  ఏనాటికి నిను చేరలేకపొతే ఏం జరుగుతుందో
ఊహించడానికి కూడా సాహసించలేను.ఎందుకు నన్ను ఇలా అనందపు శిఖరాలు, దుఃఖపు
అగాధాల మధ్య పరిగెత్తిస్తావు?

నిను చేరాలని నేను మొదలు పెట్టిన ఈ ప్రయాణం, తీరం లేని సముద్రం వైపే
అనిపిస్తున్నది.కాని ఏనాటికి అయినా నిను చేరుతాను అనే నా సంకల్పం మాత్రం
చాలా బలమైనది.అయినా నిను కలుసుకోవడం తప్ప నాకు ఈ లోకం తో వేరే పని
ఏముంది?

నా ఇష్టాలు...



నా కిష్టం నన్నయ శబ్ద సౌందర్యం
నా కిష్టం తిక్కన రస శిల్పం
నా కిష్టం కవి సార్వభౌముని మద గజ గమనం
నా కిష్టం సూరన పండించిన శృంగార రసం
నా కిష్టం క్రిష్ణ శాస్త్రి స్వేచ్ఛా విహంగం
నా కిష్టం శ్రీ శ్రీ ప్రతీక వాదం
నా కిష్టం సినారె జాతీయ వాదం
నా కిష్టం జాషువ గబ్బిలం
నా కిష్టం విశ్వనాధ నవ్య సాంప్రదాయం
నా కిష్టం చలం తీవ్రవాదం